సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తెలుగు తోపాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలను నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ఇకపోతే నయనతార తాజాగా నటించిన చిత్రం కనెక్ట్. ఈ సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే.
అయితే, ఈ హీరోయిన్ నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే విషయంపై నేను మాట్లాడను. కానీ, మన ప్రవర్తనను బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది కమిట్మెంట్ అడిగారు. నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పాను. కేవలం నా టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చాను” అని చెప్పారు.