NBK109 : బాలయ్య కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది..ఇక పూనకాలే

-

NBK 109 : ఇవాళ నందమూరి బాలయ్య బర్త్‌ డే అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. NBK109 పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు బాబీ ఈ సినిమా దర్శకత్వం వహించనుండగా, సితార బ్యానర్‌ పై ఈ సినిమా రానుంది.

నాగ వంశీ ఈ సినిమాకు నిర్మాతగా ఉండనున్నారు. ఈ సినిమాను 2024 సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు ఓ అధికారిక పోస్టర్‌ తో ముందుకు వచ్చారు. ఇక ఈ పోస్టర్‌ వివరాల్లోకి వెళితే..ఓ ఇనుప బాంక్స్ లో కత్తులు, గొడ్డళ్లు, మందు బాటిళ్లు ఉన్నాయి. ఇక ఈ పోస్టర్‌ చూస్తూంటే.. మళ్లీ ఫ్యాక్షన్‌ బ్యాక్‌ బ్రాప్‌ లో ఈ సినిమా చేస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news