Arjun Das : పవన్ OG కోసం తమిళ్ స్టార్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. తాజాగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న ఈయన హరిహర వీరమల్లుతో పాటు వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు.

యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టయినర్ ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి సినిమా వర్కింగ్ టైటిల్ ఇదే. కాగా, ఈ చిత్రబృందం నుంచి నేడు కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో తమిళ స్టార్‌ నటుడు అర్జున్‌ దాస్‌ నటిస్తున్నాడని చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. అయితే.. ఇందులో అర్జున్‌ దాస్‌ విలన్‌ గా నటించబోతున్నారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news