మ‌ల్దీవ్స్‌లో నేహా జోడీ దొంగాట‌!

 

గ‌త ఏడు నెల‌లుగా సెల‌బ్రిటీలు ఇంటి ప‌ట్టునే వుంటూ కాల‌క్షేపం చే‌స్తున్నారు. తాజాగా ల‌న్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో అన్నీ క్ర‌మ క్ర‌మంగా రీఓపెన్ అవుతున్నాయి. దీంతో బోర్ కొట్టిన‌ సెల‌బ్రిటీలు వెకేష‌న్‌కి వెళుతున్నారు. అక్క‌డ జంట‌లుగా వెళ్లి హంగామా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బెస్ట్ క‌పుల్ నేహా దూపియా.. అంగాద్ బేడీ వెకేష‌న్ కోసం మాల్దీవ్స్‌కి వెళ్లారు.

అక్క‌డి దీవుల్లో విహ‌రిస్తూ హల్‌చ‌ల్ చేస్తున్నారు. రొమాంటిక్ జోడీగా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న ఈ హాట్ జోడీకి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. ఈ వెకేష‌న్‌కి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేసిన నేహా త‌న భ‌ర్త మ‌రో అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న‌డ‌ని చెప్పి దొంగాటకు తెర‌తీయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`మాల్దీవుల్లో నల్ల బికినీ ధ‌రించి ముఖానికి హాట్ పెట్టుకుని క‌నిపిస్తున్నమహిళ‌తో అంగ‌ద్‌బేడీ రొమాన్స్ చేస్తున్నాడు. ఇది చూసి నేను ఆందోళ‌న చెందాలా?` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది నేహా. ఇంత‌కీ అంగ‌ద్ బేడీ ప‌క్క‌న ముఖానికి క్యాప్ అడ్డుపెట్టుకున్నలేడీ మ‌రెవ‌రో కాదు నేహానే. బ్లాక్ బికినీ ధ‌రించి నేహా హోయ‌లు పోయింది. ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ నేహా జోడీ దొంగాట అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.