హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో 165 క్యాంపులను ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో 46 మొబైల్ హెల్త్ క్యాంప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్యాంపుల్లో కరోనా కలకలం రేపడం సంచలనంగా మారింది. కరోనా లక్షణాలు ఉన్న రెండు వేల మందికి పరీక్షలు చేస్తే 19 మందికి పాజిటివ్‌గా తేలిందని మంత్రి ఈటల పేర్కొన్నారు. వీరందరిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక వరద, బురద నుంచి ఇంకా నగర వాసులు కోలుకోనేలేదు… మళ్లీ హైదరాబాద్ లో వర్షం పడుతుండటం నగర వాసుల్ని కలవరానికి గురిచేస్తోందని చెప్పచ్చు. కూకట్ పల్లి, ప్రగతి నగర్, జేఎన్టీయూ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ ఏరియాలో భారీ వర్షం పడుతోంది. అటు దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, ఎల్బీనగర్ లో కుంభవృష్టి కురుస్తోంది.