మెట్ గాలా 2019 ఈవెంట్‌లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునె, ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే అందరిలోకెల్లా ప్రియాంకా చోప్రా ధరించిన డ్రెస్సే మరీ వింతగా ఉంది.
సినీ తారలకు సంబంధించిన ఏవైనా వేడుకలు లేదా ఇతర ఈవెంట్లు అయితే అలాంటి కార్యక్రమానికి తారలు తళుక్కుమనే డ్రెస్సులలో వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియంలో మెట్ గాలా 2019 పేరిట ఓ ఈవెంట్‌ను నిర్వహించగా దానికి సినీ తారలు అదిరిపోయే డ్రెస్సుల్లో వచ్చి ఈవెంట్‌లో సందడి చేశారు. వారిలో ప్రియాంక చోప్రా కూడా ఉంది. అయితే ఈ అమ్మడు ధరించిన డ్రెస్సు మరీ ఎబ్బెట్టుగా ఉంది. దీంతో ప్రియాంకను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు.
మెట్ గాలా 2019 ఈవెంట్‌లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునె, ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే అందరిలోకెల్లా ప్రియాంకా చోప్రా ధరించిన డ్రెస్సే మరీ వింతగా ఉంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు నెట్‌లో దర్శనమివ్వగా వాటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు.
ప్రియాంకా చోప్రా ఆ ఈవెంట్‌లో వేసుకున్న డ్రెస్సుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఇంకా కొందరైతే.. మరికాస్త ముందుకు వెళ్లి.. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి రక రకాల ఫన్నీ మీమ్‌లతో వాటిని మళ్లీ సోషల్ మీడియాలోకి అప్‌లోడ్ చేసి వదులుతున్నారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు.. ఆ ఫొటోలు బాగా నవ్వు తెప్పిస్తుండడం విశేషం. మరి ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..!