ట్రెక్కింగ్ ప్రియుల భూతల స్వర్గం.. దేవ్ కుండ్ వాటర్ ఫాల్

-

స్విమ్మింగ్ పూల్ ఆకారంలో ఉండే ఈ వాటర్ ఫాల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు పెద్ద రాళ్ల మధ్య నుంచి సన్నని ధారలా నీళ్లు జాలువారుతూ.. కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ ఆకారంలో ఉన్న నీటి కొలనులో పడతాయి.

దేవ్ కుండ్ వాటర్ ఫాల్.. ఇది ఎక్కడుంటుందో తర్వాత తెలుసుకుందాం కానీ.. ఈ వాటర్ ఫాల్ మాత్రం ట్రెక్కింగ్ ప్రియులకు భూతల స్వర్గం. అవును.. ఆ వాటర్ ఫాల్ చేరుకోవాలంటే.. చిట్టడవిలో రెండు గంటలు నడవాలి. అది కూడా కొండలు, గుట్టలు ఎక్కుతూ నడవాల్సిందే. నడవలేని వాళ్లు ఆ వాటర్ ఫాల్‌ను చూడలేరు. రెండు గంటల ట్రెక్కింగ్ తర్వాత మీకు అద్భుతమైన దేవ్ కుండ్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్లు ఈ వాటర్ ఫాల్‌కు వెళ్లి మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ చేసినట్టూ ఉంటుంది.. వాటర్ ఫాల్‌ను ఎంజాయ్ చేసినట్టూ ఉంటుంది.

స్విమ్మింగ్ పూల్ ఆకారంలో ఉండే ఈ వాటర్ ఫాల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు పెద్ద రాళ్ల మధ్య నుంచి సన్నని ధారలా నీళ్లు జాలువారుతూ.. కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ ఆకారంలో ఉన్న నీటి కొలనులో పడతాయి. తెల్లగా పాల నురగలా పైనుంచి రాయిని ఆనుకుంటూ జాలువారుతున్న ఆ నీటిని చూస్తూ.. ఆ నీటి తుప్పర్లు మీద పడుతుంటే శరీరంపై ఏర్పడే గూస్ బంప్స్.. చుట్టూ అడవి.. పచ్చని చెట్లు.. అబ్బా.. ఈ వాటర్ ఫాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కళ్లారా చూస్తేనే ఆ అనుభూతి పొందగలం.

ఇంతకీ ఈ వాటర్ ఫాల్ ఎక్కడుంది?

ఆ.. అక్కడికే వస్తున్నా. ఈ వాటర్ ఫాల్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతాయి. మీరు పైన చూస్తున్న ఫోటోలు ఆ వాటర్ ఫాల్‌కు సంబంధించినవే. దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముంబై, బెంగళూర్ నేషనల్ హైవేపై రాయిగఢ్ జిల్లాలో ఉన్న భిరాలో ఈ వాటర్ ఫాల్ ఉంటుంది. ముంబై – పూణె హైవే మధ్యలో వచ్చే లోన్‌వాలా నుంచి కూడా ఈ వాటర్ ఫాల్‌కు చేరుకోవచ్చు. పూణె నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా ఈ వాటర్ ఫాల్‌కు వెళ్లొచ్చు. కాకపోతే.. వర్షాకాలంలో వర్షాల వల్ల వాటర్ ఫాల్‌కు చేరుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. వర్షాకాలం ముగిసే సమయంలో వెళ్తే.. అక్కడి వాతావరణం అద్భుతంగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

ముంబై నుంచి ఈ వాటర్ ఫాల్‌కు రావాలనుకునే వాళ్లు.. ముందుగా ఖొపోలీ చేరుకోవాలి. ఖొపోలీకి ముంబై నుంచి లోకల్ ట్రెయిన్స్ ఉంటాయి. అక్కడి నుంచి కారు గానీ.. జీప్ గానీ రెంట్‌కు తీసుకోవచ్చు. దానికి 1800 రూపాయలు దాకా తీసుకుంటారు. సొంత వాహనంలో ముంబై నుంచి రావాలనుకుంటే మాత్రం.. ముంబై నుంచి పన్వేల్, పన్వేల్ నుంచి ఖొపోలీ, అక్కడి నుంచి పాలీ.. ఆ తర్వాత భిరా చేరుకోవాలి.

పూణె నుంచి వచ్చే వాళ్లు.. ముందుగా విలే అనే గ్రామానికి చేరుకోవాలి. అక్కడి పూణె నుంచి బస్సులు ఉంటాయి. పూణెలోని చాందినీ చౌక్, స్వర్ గేట్ నుంచి విలే గ్రామానికి బస్సులు దొరుకుతాయి. అక్కడి నుంచి కారు గానీ.. జీప్ గానీ రెంట్‌కు తీసుకొని వెళ్లొచ్చు. దానికి 200 రూపాయలు ఖర్చవుతుంది. సొంత వాహనంలో పూణె నుంచి వెళ్లాలనుకునే వాళ్లు.. పూణె, చాందినీ చౌక్, పౌడ్, ముల్షీ, విలే, భిరాకు చేరుకోవాలి.

దగ్గరి రైల్వే స్టేషన్లు

దేవ్‌కుండ్ వాటర్ ఫాల్స్‌కు దగ్గరి రైల్వే స్టేషన్లు.. ఖొపోలీ రైల్వే స్టేషన్(సెంట్రల్ రైల్వే).. ఇక్కడి నుంచి 65 కిలోమీటర్లు, మాంగావ్ రైల్వే స్టేషన్(కొంకణ్ రైల్వే).. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు, కొలాడ్ రైల్వే స్టేషన్(కొంకణ్ రైల్వే).. ఇక్కడి నుంచి 29 కిలోమీటర్లు.

దగ్గరి ఎయిర్‌పోర్ట్స్

పూణె, ముంబై ఎయిర్ పోర్ట్స్

వసతి

దేవ్ కుండ్ వాటర్ ఫాల్స్ దగ్గర తాత్కాలిక టెంట్లు ఉంటాయి. భిరాలోనూ ఉండటానికి వసతి దొరుకుతుంది. భిరా నుంచి 10 కిలోమీటర్లు వెళితే ఫామ్ హౌస్‌లు కూడా ఉంటాయి. భిరా నుంచి కొంత దూరం వెళితే హోటల్స్ కూడా ఉంటాయి. తినడానికి ఫుడ్ కావాలంటే.. భిరాలో దొరుకుతుంది. లేదంటే హోటల్స్‌లో కూడా ఉంటుంది.

వాటర్ ఫాల్స్ సమీపంలో చూడాల్సిన ప్రదేశాలు

అంధబాన్ ట్రెక్ (36 కిలోమీటర్లు)
కుండాలికా రివర్ రాఫ్టింగ్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్(5 కిమీలు)
తంహిని ఘాట్
సుధాగాడ్ ఫోర్ట్ ట్రెక్(25 కిమీలు)
సరస్‌గాడ్ ఫోర్ట్ ట్రెక్(28 కిమీలు)
థానలె గుహలు(30 కిమీలు)

Read more RELATED
Recommended to you

Exit mobile version