ఉగాది వేళ.. నాని ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త పోస్టర్ విడుదల

-

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సరిపోదా శనివారం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, పోస్టర్, స్పెషల్ గ్లింప్స్, టీజర్ను విడుదల కాగా.. అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 9) ఉగాది సందర్భంగా సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. సాయి కుమార్, నాని ఉన్న ఫోటోను పంచుకుంది. సూర్యగా నాని మరియు శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్లో చిరునవ్వుతో కనిపిస్తారు. పోస్టర్లో మనం ఒక వేడుక వాతావరణాన్ని చూడవచ్చు. ఈ ఫోటో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news