టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘నువ్వు నేను’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అనిత.. ఆ తర్వాత కాలంలో వరుస తెలుగు పిక్చర్స్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించిన ఈమె.. బుల్లితెరపైన కూడా సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ లో పాగా వేసిందని చెప్పొచ్చు.
హిందీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన అనిత.. హిందీ సీరియల్స్, టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వైవాహిక జీవితంలో అడుగు పెట్టి మాతృమూర్తి అయింది.అలా ఇండస్ట్రీకి దూరం అయినప్పటకీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది అనిత. రెగ్యులర్ గా తన అప్ డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా తన భర్తతో కలిసి ఓ బోల్డ్ యాక్ట్ చేసింది.
ఏకంగా కండోమ్ ప్రమోషన్ యాడ్ చేసేసింది అనిత. తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో తన భర్తతో కలిసి ఆ కండోమ్ గురించి మాట్లాడింది. సదరు కండోమ్ పని తీరు గురించి వివరించింది. భర్తతో కలిసి అనిత చేసిన కండోమ్ ప్రమోషన్ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది.
ఇంత బోల్డ్ గా అనిత్ యాడ్ చేయడం ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, అది ఆమె ఇష్టమని మరి కొందరు పోస్టులు పెడుతున్నారు. ఆడవారికి ఈ కండోమ్ తో చాలా ఉపయోగం ఉందని పేర్కొంటూ కండోమ్ యూసేజ్ గురించి చెప్పడం బోల్డ్ ఎడ్యుకేషన్ అని అనిత భావించి ఉండొచ్చని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. డురెక్స్ కండోమ్ గురించి అనిత దంపతులు ప్రమోట్ చేశారు.
https://www.instagram.com/p/CcNSCW-FD-M/?utm_source=ig_embed&ig_rid=b54f7765-e6fd-4ba2-8196-dbcb562f7136