ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు వీర విహారం చేశారు. శివమ్ దూబె ( 46 బంతుల్లో 94 ), రాబిన్ ఉత్తప్ప ( 50 బంతుల్లో 88 ) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దూబె ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. అలాగే ఉత్తప్ప 4 ఫోర్లు, 9 సిక్స్ లు కొట్టాడు. బెంగళూర్ బౌలర్లకు మూడు చరువుల నీటిని దాగించారు. బౌలింగ్ చేయలంటేనే జంకే విధంగా బ్యాటింగ్ చేశారు. దూబె, ఉతప్ప పోటీ పడుతూ బంతులను బౌండరీలకు తరలించారు.
బెంగళూర్ బౌలర్ ఆకాశ్ దీప్ ను చీల్చి చెండాడారు. దీప్ 4 ఓవర్ లల్లో 57 పరుగులు తీసుకున్నారు. ఒక్క ఓవర్ లోనే 24 పరుగులు రాబట్టారు. దీంతో చెన్నై 200 మార్క్ ను క్రాస్ చేసింది. 4 మ్యాచ్ లు ఓడి ఆకలితో ఉన్న బ్యాటర్లు.. బౌంగళూర్ కు చుక్కలు చూపించారు. వీరి విధ్వంసకర బ్యాటింగ్ కు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 215 పరుగులు చేసింది. బెంగళూర్ విజయం సాధించాలంటే.. 216 పరుగులు చేయాల్సి ఉంటుంది.