Ram Charan: RC 15 టైటిల్ ‘విశ్వంభర’ ..ఓకే చెప్పిన శంకర్!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC 15. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ పిక్చర్ లో శంకర్ మార్క్ యాక్షన్, స్టోరి, డైలాగ్స్, విజ్యువల్ గ్రాండియర్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తోందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా టైటిల్ గురించి కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలొస్తూనే ఉన్నాయి. దర్శకుడు శంకర్ తన చిత్రాలకు డిఫరెంట్ అండ్ క్లాసీ టైటిల్స్ పెట్టడానికి ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలోనే ఆర్సీ 15 టైటిల్ పైన ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ‘సర్కారోడు’, ‘అధికారి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కాగా, తాజాగా వస్తున్న వార్తలు, సమాచారం ప్రకారం..ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్.

ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘ఆఫీసర్’ అనే టైటిల్ పెట్టాలని సూచన చేశారట. కానీ, ఈ టైటిల్ తో నాగార్జున-RGV కాంబోలో సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలోనే RC 15 టైటిల్ పాన్ ఇండియా రీచ్ ప్లస్ హైప్ అయ్యే విధంగా ఉండాలని డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news