‘జైలర్’ సినిమాకు రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్ల..?

-

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రతీ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తమిళ్ తలైవా నటించిన సినిమాలను జనాలు చూస్తుంటారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఫిల్మ్ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తు్న్న 169వ సినిమా ఇది.

ఈ ఫిల్మ్ ..డెఫినెట్ గా అభిమానుల అంచనాలను అందుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో సూపర్ స్టార్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సౌతిండియాలోనే అంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రజనీకాంత్ ..నెంబర్.1 పొజిషన్ లో ఉన్నారని అంటున్నారు సినీ పరిశీలకులు. కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్..ప్రకారం..రజనీకాంత్‌కు ఈ సినిమాలో నటించేందుకుగాను రూ.148 కోట్లకుపైన పారితోషికం ఇచ్చారని టాక్. అంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రజనీ రికార్డుకెక్కారని తలైవా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news