Thalapathy 66: తలపతి 66లో మరో ప్రముఖ నటుడు..మేకర్స్ అనౌన్స్‌మెంట్

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ – టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘తలపతి 66’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో జరిగాయి. ఇందులో విజయ్ కు జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఇది తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

వెరీ డిఫరెంట్ స్టోరితో సినిమా తెరకెక్కుతున్నదని దిల్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న చిత్రం ఇది. కాగా, తలపతి విజయ్ ఈ పిక్చర్ స్టోరి విన్న తర్వాత వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

ఈ చిత్రంలో మరో ప్రముఖ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు మంగళవారం మూవీ యూనిట్ తెలిపింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయమై పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్టర్ శ్యామ్ ఈ సినిమాలో విజయ్ కి యంగర్ బ్రదర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. శ్యామ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘కిక్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన శ్యామ్…‘రేసుగుర్రం’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు.

తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఇటీవల విడుదలైంది. తమిళనాట ఈ సినిమాకు మంచి ఆదరణ ఉంది. కానీ, తెలుగులో అనుకున్న స్థాయిలో లేదు. ‘తలపతి66’ ఫిల్మ్ పైన అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. దిల్ రాజు..ఈ చిత్రంతో తొలిసారి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో అసోసియేట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news