దమ్ముంటే రాహుల్ గాంధీని ఓయూకు రమ్మను… జగ్గారెడ్డికి బాల్క సుమన్ సవాల్

-

తెలంగాణ ఇస్తామని 2004లో పొత్తు పెట్టుకుని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నేత బాల్క సుమన్. కిరణ్ కుమార్ రెడ్డి పక్కన ఉన్న జగ్గారెడ్డికి తెలంగాణ గురించి అర్థం కాదని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించానని… మీ రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. మేం తెలంగాణ పక్షాన పోరాడుతున్నామని… నువ్వు ఆంధ్రవాసులకు ఊడిగం చేస్తున్నావని జగ్గారెడ్డిని విమర్శించారు. నేను తలుచుకుంటే నువ్వు తిరుగుతావా…? అంటూ జగ్గారెడ్డికి కౌంటర్ ఇచ్చాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతే కుదరదని రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిని హెచ్చరించారు. రాహుల్ గాంధీని ఓయూకు రమ్మను అని సవాల్ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వస్తే ముందుగా అమరవీరుల కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో కాపాడుకోండి అని హితవు పలికింది.

Read more RELATED
Recommended to you

Latest news