బిగ్‌బాస్‌: ఆ గ్రూప్ డామినేష‌న్ ఎక్కువైందా…!

-

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా… ఏ బిగ్‌బాస్‌లో అయినా హౌస్‌లో గ్రూపులు ఉండటం కామన్ అయ్యింది. తెలుగులో మూడు సీజన్లలోనూ హౌస్ లో రెండు గ్రూపులు కొనసాగుతూ వచ్చాయి. ఈ గ్రూపు సభ్యులు ఒకరికి ఒకరు అనుకూలంగా వ్యవహరించకపోవడం కామన్. తాజాగా తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ షో మిడిల్ నుంచి వరుణ్ సందేశ్, రాహుల్, పునర్నవి ఒక గ్రూపుగా బాబా భాస్కర్, ఆలీ, శివజ్యోతి, రవికృష్ణ కొనసాగుతూ వచ్చారు. ఇక బిగ్ బాస్ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో హౌస్‌లో ఎనిమిది మంది సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో తాజా ఎలిమినేషన్ లో పునర్నవి సైతం హౌస్ నుంచి ఎలిమినేట్ అవడంతో బిగ్ బాస్ గేమ్ మరింత రక్తి కట్టింది.

ఇప్పుడు హౌస్ లో వరుణ్ సందేశ్, రాహుల్, వితిక‌ ఒక గ్రూపుగా ఉంటే… రెండో గ్రూపులో శ్రీముఖి, శివ‌జ్యోతి, ఆలీ, బాబా భాస్కర్ మ‌రో గ్రూపులో కొనసాగుతున్నారు. తాజా ఎలిమినేషన్ ప్రక్రియలో ఈ రెండు గ్రూపుల మ‌ధ్య గ్యాప్ స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. తాజా నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ట్రాలీ పార్కింగ్ గేమ్ బిగ్‌బాస్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రాహుల్‌, బాబా భాస్కర్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. తనను బాబా బ్యాచ్‌ టార్గెట్‌ చేసిందని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

బాబా కావాల‌నే అంద‌ర్ని ఆపేసి శ్రీముఖి, శివ‌జ్యోతి వెళ్లేందుకు సాయం చేస్తున్నాడ‌ని రాహుల్ ఆరోపించాడు. బాబా త‌న దారికి అడ్డుగా రావ‌డం వ‌ల్లే తాను కింద ప‌డ్డాన‌ని రాహుల్ వాపోయాడు. టాస్క్‌ మొదలైనప్పుడు తనకు అలీకి మధ్యన ఉన్న శివజ్యోతి.. మూడో రౌండ్‌ తర్వాత బాబావైపునకు ఎలా వెళ్లిందని ప్రశ్నించాడు. బాబా కావాలనే శివజ్యోతిని సేవ్‌ చేయాలని ప్లాన్‌ చేశాడని ఆరోపించాడు.

వాస్త‌వంగా చూస్తే ఇది కొంచెం నిజ‌మ‌నే అనిపిస్తోంది. గేమ్ ప్రారంభంలో మూడో స్థానంలో రాహుల్ ఉన్నాడు. ఆ త‌ర్వాత బాబా త‌న ప‌క్క‌న శివ‌జ్యోతి ఉండేలా చోటు ఇవ్వ‌డంతో రాహుల్ చివ‌రి ప్లేస్‌కు వెళ్లిపోయాడు. దీంతో రాహుల్ బ‌జ‌ర్ మోగ‌గానే ట్రాలీని స్టాండ్‌లో పెట్ట‌లేక ఎలిమినేట్ అయ్యాడు. బాబా మాత్రం ఆడపిల్ల కావడంతో ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక త‌న ప‌క్క‌న ఉండేందుకు ఓకే చెప్పాన‌ని తెలిపాడు. ఇక హౌస్‌లో పున‌ర్న‌వి వెళ్లిపోవ‌డంతో శ్రీముఖి, ఆలీ, బాబా, శివ‌జ్యోతి గ్రూపు డామినేష‌న్ ఎక్కువైంది. మ‌హేష్ ఎలిమినేట్ అయినా అత‌డు కూడా ఎక్కుడ శ్రీముఖి గ్రూపులోనే ఉంటూ వ‌చ్చాడు. మ‌రి ఈ వారం ఎలా ?  ఉంటాడో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version