నిహారిక డివర్స్ ఇంటర్వ్యూపై మాజీ భర్త స్ట్రాంగ్ రియాక్షన్

-

నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె డివోర్స్‌ తీసుకోవడంపై మాట్లాడింది. ఆ బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని చెబుతూ విడాకులకు ముందు, ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలను షేర్ చేసుకుంది. హోస్ట్‌ సంబంధిత వీడియో లింక్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా దానిపై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నల గడ్డ రియాక్ట్‌ అయ్యాడు.

ఇటీవల నిహారిక ఎదుర్కొంటున్న నెగెటివిటీని దూరం చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నానంటూ కామెంట్ బాక్సులో చైతన్య సుదీర్ఘ పోస్టు పెట్టాడు. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదని తనకూ తెలుసని.. కానీ, పరోక్షంగా బాధితులను ట్యాగ్‌ చేయడం, అందుకు ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికాడు. ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికీ ఉంటుందన్న చైతన్య.. విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదని చెప్పాడు. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్‌ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు అని అనుకుంటున్నా అని కామెంట్లో తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news