Cm Jagan : నేడు విశాఖకు సీఎం జగన్మోహన్ రెడ్డి

-

సీఎం జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోనున్న ఆయన భీమిలి సంగీవలసలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన మాటమంతి నిర్వహిస్తారు.

CM Jagan will visit Visakhapatnam today

కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 31.19 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. 12 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులు పదేళ్ల తర్వాత పట్టాలపై సర్వహక్కులు పొందనున్నారు. అప్పుడు వారు ఇళ్లపై బ్యాంకులోన్లు తీసుకోవడం లేదా విక్రయించుకునే వీలుంటుంది. కాగా, ఇవాళ, రేపు రిజిస్ట్రేషన్ల ట్రయల్ రన్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news