బ్యూటిఫుల్ హీరోయిన్ నిఖిషా పటేల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్- ఎస్ జే సూర్య కాంబో మూవీ ‘కొమురం పులి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఖుషి’ తర్వా ఎస్ .జే.సూర్య దర్శకత్వంలో ‘కొమురం పులి’ చిత్రంపై భారీ అంచనాలే ఉండగా, వాటిని అందుకలోకపోయింది ఫిల్మ్.
ఈ పిక్చర్ కు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సుందరి తెలుగు తెర మీద ‘పులి’ సినిమా తర్వాత మళ్లీ కనబడనేలేదు. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేసిన ఈ అమ్మడు..మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అయితే చూడలేదు.
తాజాగా ఈ పవన్ కల్యాణ్ హీరోయిన్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆసక్తికర సమాధానాలిచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోల గురించి నెటిజన్లు అడగగా ఆన్సర్స్ ఇచ్చింది నిఖిషా. మహేశ్ బాబు ఫెయిర్ అండ్ లవ్లీ అని పేర్కొన్ని నిఖిషా..తన ఫేవరెట్ యాక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అని తెలిపింది.
ఈ క్రమంలోనే తనతో కో స్టార్‌గా నటించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గడ్డం అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటి వరకు ఆయనకు అదే బెస్ట్ లుక్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత నెటిజన్లు మెగాస్టార్ గురించి చెప్పాలని అడగగా, ఈ భామ కన్ఫ్యూజ్ అయింది.
ఏ మెగాస్టార్ అని అడిగింది. అయ్యో నీకు పవన్ బ్రదర్ మెగాస్టార్ చిరు తెలియదా? అందుకే నీకు ఆఫర్స్ రాలేదని నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు. కాగా, ఇండస్ట్రీలో మెగాస్టార్స్ చాలా మంది ఉన్నారని, మమ్ముట్టీ, అమితాబ్ లను కూడా మెగాస్టార్స్ అంటారని, అందుకే ఆమె కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు. యూకేలో ఉన్న వ్యక్తితో తన పెళ్లి జరగబోతున్నదని ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పంది నిఖిషా. దాంతో నెటిజన్లు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు.
His new beard! His best look so far!!!! @PawanKalyan https://t.co/yth5JODYbA
— Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022
Soon! Found him! Uk https://t.co/milyEyEY6Z
— Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022