ఏపీలో “ఉప్పెన” సీన్ రిపీట్..యువకుడి మర్మాంగంపై దాడి !

-

ఏపీలో దారుణంలో చోటు చేసుకుంది. అచ్చం ఉప్పెన్‌ సినిమాలో జరిగిన విధంగానే.. ప్రేమించానని వేధించిన ఓ యువకుడి మర్మాంగాలపై దాడి చేశాడు యువతి తండ్రి. ఈ దారుణమైన సంఘటన ఏలూరు జిల్లా నరసింహా రావు పాలెం లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నరసింహారావు పాలెం కు చెందిన ఓ యువకుడి.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించాడు.

దీనికి ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో.. ఆ యువతి ఫోటోలు, తన పోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు యువకుడు. తమ మధ్య లవ్‌ ఉందని.. అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన.. ఆ యువతి తండ్రి, కుటుంబ సభ్యులు.. యువకుడి పై దాడి చేశారు.

ఊర్లో ఉన్న ఓ చీకటి గదిలోకి తీసుకుని పోయి.. యువకుడి మర్మాంగాలపై దాడి చేశాడు. దీంతో ఆ యువకుడు..స్పృహా కోల్పోయాడు. ఇక సంఘటన తెలియడంతో.. రంగంలోకి దిగారు పోలీసులు. యువతి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news