నిత్యా మీనన్ కు పెళ్లి.. అందుకే అలా?

-

నిత్య పెళ్లికి ముందు సహ‌జీవ‌నం త‌ప్పేం కాద‌ని చాలాసార్లు బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ అనుభవం సుదీప్ తో వ‌చ్చేసింది. నిత్య వ్య‌క్తిత్వాన్ని బ‌ట్టి మ‌ళ్లీ ప్రేమ దోమ అన‌డానికి ఆస్కారం లేదు.

నిత్యామీన‌న్ రెండు, మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్. ప్రస్తుతం ఆమె కొత్త ఫోటోలు సోష‌ల్ లో ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయి. లావుగా ఉండే అమ్మ‌డు క‌ష్ట‌ప‌డి స‌న్న‌జాజిలా మారిపోయింది. మ‌రి ఈ మార్పు దేనికి సంకేతం అంటే పెళ్లి అనే ఓ మాట వినిపిస్తోంది. నిత్య‌కి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారుట‌. వ‌య‌సు 30 మీద ప‌డింది. సినిమా కెరీర్ కూడా దాదాపు ఎండింగ్ లో ఉంది. క‌న్న‌డ‌లో సినిమాలు చేస్తున్నా….మిగతా ఏ భాష‌లోనూ అమ్మ‌డికి పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అందుకే ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల‌ని డిసైండ్ అయింది. ఆ స‌న్నిజాజు మార్పు అందుకే అని వినిపిస్తోంది. ఒక‌వేళ సినిమాల కోస‌మైతే ఎప్పుడో స‌న్న‌బ‌డేది.

కానీ గ్లామ‌ర్ గా క‌నిపించ‌డానికి ఒప్పుకోదు కాబ‌ట్టి…సినిమాల‌ను లైట్ తీసుకుంది. వ‌చ్చిన సినిమాలు చేస్తోంది…త‌ప్ప కాన్పిడెంట్ గా చేయ‌డం లేదు. పైగా ఆమె ఫేడౌట్ అయిపోయింది. ఇప్పుడు క‌ష్ట‌ప‌డి సినిమాలు చేసి సాధించేది ఏమి లేదు. హెల్త్ అండ్ వెల్త్ బాగుంటే అన్నీ తమ ద‌గ్గ‌ర‌కే వ‌స్తాయ‌న్న ధీమా ఉంటుందిగా . ఇప్పుడ‌దే ఫాలో అవుతోంది. ఇక అప్ప‌ట్లో క‌న్న‌డ హీరో సుదీప్ తో కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. నిత్య కోసం సుదీప్ ప్ర‌భుదేవా టైపులో భార్య‌కు విడాకులు ఇవ్వ‌డానికి సిద్ద‌ప‌డ్డాడు. చివ‌రి నిమిషంలో రియ‌లైజ్ అయి వ‌చ్చే జ‌న్మ అంటూ ఉంటే అప్పుడు పెళ్లి చేసుకుందామ‌ని ఎస్కేప్ అయ్యాడు.

ఇక నిత్య పెళ్లికి ముందు సహ‌జీవ‌నం త‌ప్పేం కాద‌ని చాలాసార్లు బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ అనుభవం సుదీప్ తో వ‌చ్చేసింది. నిత్య వ్య‌క్తిత్వాన్ని బ‌ట్టి మ‌ళ్లీ ప్రేమ దోమ అన‌డానికి ఆస్కారం లేదు. అందుకే ఇప్పుడు ఇంట్లో చూస్తోన్న ఏదో ఒక సంబంధానికి ఏ క్ష‌ణ‌మైనా ఒకే చెప్ప‌డానికి ఆస్కారం ఉంద‌ని అంటున్నారు. చూద్దాం ఈ రూమ‌ర్ లో ఎంత నిజ‌ముందో. ప్ర‌స్తుతం నిత్య చేతిలో కొన్ని సినిమాలున్నాయి. త‌మిళో రెండు, హిందీలో ఒక సినిమా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news