విజయ్ స్టామినాకు పర్ఫెక్ట్ ఎక్సాంపుల్

-

యువ సంచలనం విజయ్ దేవరకొండ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు. గీతా గోవిందం కలక్షన్స్ అతనికి స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నోటా సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమా బిజినెస్ తో హంగామా సృష్టిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాను ఆనంద్ రంగ డైరెక్ట్ చేస్తున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలను పెంచింది. తమిళ సినిమానే అయినా తెలుగులో విజయ్ ఫాలోయింగ్ క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ సినిమా 30 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందట. గీతా గోవిందం 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చి 60 కోట్ల షేర్ వసూళు చేసింది. ఆ క్రేజ్ తో నోటా మూవీని 30 కోట్ల దాకా కోట్ చేశారట. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందుకు సరే అంటున్నట్టు తెలుస్తుంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న నోటా సినిమాలో విజయ్ దేవరకొండ సిఎం పాత్రలో నటిస్తున్నాడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాజర్, సత్య రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అక్టోబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version