టాలీవుడ్‌లో పవిత-నరేశ్‌లపై సోషల్ మీడియాతో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లిళ్లు అయిన వీళ్లు సహజీవనం చేయడంపై కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ట్రోలింగ్ చేయడతో వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు సినీ నటులు పవిత్రా లోకేష్, నరేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
తమ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే.. నటి పవిత్ర లోకేష్ ట్రోలింగ్ కేసును పోలీసులు విచారణ చేశారు. అంతేకాదు కేసు నమోదు చేసిన సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు… 15 యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. 15 యూట్యూబ్ ఛానళ్లు,వెబ్‌సైట్ల లింక్‌లను పోలీసులకు ఇచ్చింది పవిత్ర లోకేష్. ఈ నేపథ్యంలోనే.. నోటీసులు ఇచ్చారు పోలీసులు.