ఎన్టీఆర్ కూడా చీపురు పట్టుకున్నాడు..ఈ సారి ఎవరు అంటే …!

-

సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు సినీ తారలు తమ అభిమానులను అలరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీడియో లు పంచుకుంటూ వాళ్ళు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాను ఇంట్లో పని చేస్తున్న వీడియో ని పోస్ట్ చేసి భార్యకు సహకరించాలి అని కోరారు. దీనికి రాజమౌళిని నామినేట్ చేసారు ఆయన.

దానికి స్పందించిన జక్కన్న సోషల్ మీడియాలో తాను ఇంట్లో పని చేస్తున్న వీడియో ని పోస్ట్ చేసారు. ఇక రామ్ చరణ్ ని, జూనియర్ ఎన్టీఆర్ ని దీనికి నామినేట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాను ఇంట్లో పని చేస్తున్న వీడియో ను పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా పలువురిని నామినేట్ చేసారు. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు పనులను కూడా పంచుకుందాం అన్నారు.

తాను బాలకృష్ణను, మెగాస్టార్ చిరంజీవిని, అక్కినేని నాగార్జునను, విక్టరీ వెంకటేష్ ని ట్యాగ్ చేసారు. అలాగే కొరటాల శివ ను కూడా తన ట్వీట్ లో యాడ్ చేసారు. బాల బాబాయ్ అంటూ పేర్కొన్నారు. రామ్ చరణ్ కూడా త్వరలో పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చిరంజీవి తన ఇంట్లో తాను చేస్తున్న కార్యక్రమాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్ డౌన్ లో ఈ విధంగా అలరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news