యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ భీమ్ టీజర్.. ఏకంగా లక్ష..

-

ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూపులు చూసిన ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీర్చడానికి వచ్చిన భీమ్ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రామరాజు ఫర్ భీమ్ గా రిలీజైన ఈ టీజర్ కి అటు అభిమానుల నుండి ఇటు సినిమా ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో దూసుకుపోతున్న ఈ టీజర్, తెలుగు వెర్షన్ కి లక్షకి పైగా కామెంట్లు పడ్డాయి.
తెలుగు సినిమా చరిత్రలోనే ఇంతవరకూ ఏ టిజర్ అందుకోని రికార్డుని భీమ్ టీజర్ అందుకుని చరిత్ర సృష్టించింది. 27మిలియన్ల వ్యూస్ తో 1మిలియన్ కి పైగా లైకులతో రికార్డులు తిరగరాస్తున్న ఎన్టీఆర్ భీమ్ టీజర్, తాజాగా లక్ష కామెంట్లు రాబట్టుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మేరకు ఆర్ ఆర్ ఆర్ పై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి సృష్టిస్తున్న మరో అద్భుత దృశ్య కావ్యం వెండితెర మీద తిరుగులేని సందడి చేయనుందడంలో ఎలాంటి సందేహం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news