ఈ ఏడాది చివరికి వచ్చేస్తున్న కీలక వ్యాక్సిన్…!

ఆక్స్ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ త్వరలో బ్రిటన్‌ లోని ప్రజలకు ఇస్తామని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి హ్యూమన్ ట్రయల్స్ పూర్తి అవుతాయని, ఆ డేటా ఆధారంగా పరిస్థితి చూసి అప్పుడు ప్రజలకు ఇస్తామని చెప్తున్నారు. డిసెంబర్ లేదా 2021 ప్రారంభంలో బ్రిటన్ ప్రజలకు వ్యాక్సిన్‌ విడుదల చేస్తారు అని వార్తా సంస్థ రాయిటర్స్ కథనం రాసింది.

ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క చివరి దశ ట్రయల్ ఫలితాల కోసం భారతదేశం కూడా ఎదురు చూస్తుంది. ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిఇఓ అదార్ పూనవల్లా మాట్లాడుతూ , జనవరిలో హ్యూమన్ ట్రయల్స్ పూర్తయిన వెంటనే ఆక్స్ఫర్డ్ యొక్క వ్యాక్సిన్ భారతదేశంలో లభిస్తుందని, దీనికి అవసరమైన అన్ని ఆమోదాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.