జక్కన్నకు ఎన్టీఆర్ షాక్..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ గా మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించబోయే ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తూ ట్రిపుల్ ఆర్ అంటూ రాజమౌళి వదిలిన ప్రీ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం అరవింద సమేత తర్వాత రాజమౌళి సినిమాకు డేట్స్ ఇచ్చాడు ఎన్.టి.ఆర్. చరణ్ కూడా ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా చేస్తుండగా ఆ సినిమా ముగించి ట్రిపుల్ ఆర్ షూట్ లో పాల్గొననున్నాడు.

అసలైతే డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాకు ఎన్.టి.ఆర్ షాక్ ఇచ్చాడట. తండ్రి మరణం ఓ పక్క బాధపెడుతున్నా ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో సినిమా చేశాడు ఎన్.టి.ఆర్. అక్టోబర్ 11న సినిమా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్.టి.ఆర్ ఇప్పుడప్పుడే పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు.

అరవింద సమేత రిలీజ్ వరకు యాక్టివ్ గా ఉండి ఆ తర్వాత ఓ 6 నెలలు దాకా ఎన్.టి.ఆర్ రెస్ట్ తీసుకోనున్నాడని తెలుస్తుంది. అందుకే జక్కన్న మల్టీస్టారర్ కు షాక్ ఇచ్చాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version