ఎన్టీఆర్ బయోపిక్ షాకింగ్ న్యూస్..!

-

ntr biopic release postponed

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ క్రిష్ డైరక్షన్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొదట ఒకే సినిమాగా వదలాలనుకున్న ఈ బయోపిక్ కాస్త రెండు పార్టులుగా వస్తుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా వస్తుండగా మహానాయకుడు సినిమాను జనవరి 24న రిలీజ్ ప్లాన్ చేశారు.

అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరక్షన్ ఛాన్స్ తనకు వస్తుందని ఆశించిన ఆర్జివి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను దసరాకు మొదలు పెట్టిన వర్మ జనవరి 24న రిలీజ్ అంటూ ఛాలెంజ్ చేశాడు. ఎన్.టి.ఆర్ రెండో పార్ట్ కూడా అదే డేట్ న రిలీజ్ కానుంది.

అందుకే ఎన్.టి.ఆర్ మహానాయకుడు మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నారట. ఫిబ్రవరిలో ఆ సినిమా వస్తుందని తెలుస్తుంది. వర్మ సినిమాకు భయపడి కాదు రెండు సినిమాలకు కనీసం ఒక నెల అయినా గ్యాప్ ఉండాలన్న ఉద్దేశంతో మహానాయకుడు సినిమా వాయిదా వేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news