మహేష్ తర్వాత లైన్ లో ప్రభాస్

-

after mahesh Babu sukumar movie planing with prabhas

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన సుకుమార్ ఆర్య నుండి రంగస్థలం వరకు తన సత్తా చాటుతూ వచ్చాడు. కెరియర్ లో ఆర్య తర్వాత సుకుమార్ మార్క్ హిట్ అందుకుంది అంటే రంగస్థలం మాత్రమే మధ్యలో 100% లవ్, నాన్నకు ప్రేమతో సినిమాలు సక్సెస్ అందుకున్నా అతని రేంజ్ కు తగిన ఫలితాన్ని అందుకోలేదు.

రంగస్థలం తర్వాత మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు సుకుమార్. ఇప్పటికే మహేష్ ను మెప్పించే కథ కోసం తన టీంతో డిస్కషన్స్ చేస్తున్నాడు. ఇదిలాఉంటే మహేష్ తర్వాత సుకుమార్ ప్రభాస్ తో సినిమా చేస్తాడని లేటెస్ట్ టాక్. ఆర్య కథ అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్ కే వినిపించాడట సుకుమార్ అయితే అది తనకి సూట్ అవదని వద్దన్నాడట.

రంగస్థలం సినిమా చూసి సుక్కుకి ప్రత్యేకంగా ఫోన్ చేసి మెచ్చుకున్న ప్రభాస్ తనకు అలాంటి కథ ఒకటి సిద్ధం చేయమని అన్నాడట. మహేష్ సినిమా తర్వాత ప్రభాస్ తోనే సుక్కు సినిమా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. మరి ఆ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news