ఎన్.టి.ఆర్ ఎమోషనల్ స్పీచ్.. తాను ఏడుస్తూ ఫ్యాన్స్ ను ఏడిపించాడు..!

-

అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ ఎమోషనల్ స్పీచ్ నందమూరి ఫ్యాన్స్ గుండె భారం అయ్యేలా చేసింది. తండ్రి హరికృష్ణ మరణం తర్వాత ఎన్.టి.ఆర్ అభిమానుల ముందుకు వచ్చిన మొదటి వేదిక కావడం వల్ల ఎన్.టి.ఆర్ స్పీచ్ పై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అయితే మొదట సినిమా గురించి మాట్లాడిన తారక్ తర్వాత తండ్రి మరణం గురించి ప్రస్థావించారు.

త్రివిక్రం తో సినిమా నా 12 ఏళ్ల కల. నువ్వే నువ్వే దగ్గర నుండి తెలిసిన త్రివిక్రంతో సినిమా ఎందుకు లేటవుతుంది అనుకునే వాడిని. కాని ఆయనతో సినిమా చేయడం. నా తండ్రి చనిపోవడం జరిగింది. తనకు జీవితంలో పరిపక్వత వచ్చాక ఆయనతో సినిమా చేయాలని ఉందేమో అందుకో నాన్న దూరమయ్యాడని అన్నాడు ఎన్.టి.ఆర్. ఈ నెల రోజులు నాకు అన్ని తానయ్యాడు త్రివిక్రం. అందుకే ఆయన్ను ఆత్మబంధువు అని సంభోదించాడు తారక్.

ఇక స్పీచ్ మధ్యలో త్రివిక్రం ను స్వామి అంటూ పిలవడం విశేషం. ఎప్పుడు తాత ఫోటోని చూస్తూ మాట్లాడే తాను ఇంత త్వరగా ఆయన పక్కన తన తండ్రి ఫోటో చూడాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. ఇక తండ్రికి కొడుకుగా.. భార్య కు భర్తగా.. కొడుక్కి తండ్రిగా అన్ని బాధ్యతలను ఆయన గొప్పగ నిర్వర్తించారని. ఎప్పుడు అభిమానుల శ్రేయస్సు కోరే నాన్న గారు తనకు కూడా అభిమానులు జాగ్రత్త అని చెప్పే వారని గుర్తుచేసుకున్నారు ఎన్.టి.ఆర్.

ఎన్.టి.ఆర్ ఎమోషనల్ స్పీచ్ తో ఓ పక్క అక్కడ ఉన్న వారంతా మాటలు రాని బొమ్మల్లా నిలుచుండిపోయారు. చివరగా ఇంటికి జాగ్రత్తగా వెళ్లండంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడి ప్రసంగం ముగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version