ఆ ఒక్క సీన్.. గూస్ బమ్స్..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో భాగంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి షో నుండే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ మొత్తం ఎన్.టి.ఆర్ సిని రంగానికి చెందిన కథతోనే వచ్చింది.

ఇక ఈ సినిమా దర్శకుడు సినిమాను అందంగా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా సినిమాను ఆడియెన్స్ కు చేరవేసే క్రమంలో ఒకటి రెండు సన్నివేశాలు అద్భుతంగా రాసుకున్నారు. అందులో ఒకటి ఎన్.టి.ఆర్ కృష్ణావతారం సన్నివేశం. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలతో కెవి రెడ్డి పోట్లాడి మరి రామారావుకి కృష్ణుడి వేషం ఇవ్వాలని అంటాడు. చక్రపాణి డిస్కషన్ మధ్యలోనే బయట సిగరెట్ తాగేందుకు వెళ్తాడు.

అలా నడుచుకుంటూ వచ్చే కృష్ణుడిని చూసి అవాక్కవుతాడు. అక్కడ పనిచేస్తున్న వారు ఎన్.టి.ఆర్ కు కొబ్బరికాయ కొడతారు. ఆ సీన్ చూసిన వారెవరికైనా గూస్ బమ్స్ రాక తప్పదు. సినిమా హైలెట్ గా చెప్పుకునే సీన్స్ లో అది ఒకటి. ఇక పతాక సన్నివేశాల్లో ఎన్.టి.ఆర్ తెలుగు దేశం పార్టీ ఎనౌన్స్ మెంట్ చేసిన సన్నివేశం కూడా అలరిస్తుంది. మొత్తానికి ఎన్.టి.ఆర్ కథానాయకుడు అందరిని మనసులు గెలిచింది. మరోసారి సంక్రాంతికి బాలయ్య సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news