ఈ బుల్లోడు బౌలింగ్‌లో బుమ్రాను మించేలా ఉన్నాడు.. వీడియో

-

బుమ్రా బౌలింగ్ గురించి మీకు తెలుసు కదా. బాల్ ఎప్పుడు ఎలా వెళ్తుందో తెలియదు. బ్యాట్స్‌మెన్‌కు మాత్రం బుమ్రా తన బౌలింగ్‌తో చుక్కలు చూపిస్తాడు. తన యూనిక్ స్టయిల్ బౌలింగ్‌తో బుమ్రాకు ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో ఈ బుల్లోడు ఒకడు. అవును.. ఆస్ట్రేలియాకు చెందిన ఈ పిల్లోడు బుమ్రా బౌలింగ్ వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పుడు ఆ బుల్లోడి బౌలింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

క్రికెటర్ బుమ్రా, కామెంటేటర్ హర్షా భోగ్లేను టాగ్ చేస్తూ ఈ వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌పై బుమ్రా, హర్షా భోగ్లే కూడా స్పందించారు. ఆ పిల్లాడు క్యూట్‌గా ఉన్నాడు. నా బెస్ట్ విషెస్ చెప్పండి.. అంటూ బుమ్రా రిప్లయి ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news