నందమూరి బాలకృష్ణ నటించి నిర్మించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కింది. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి మనలోకం సమీక్షలో చూద్దాం.
కథ :
ఎన్.టి.ఆర్ కథ తెలుసుకోవాలన్న ఆశ అందరికి ఉంటుంది. తెలిసిన వాళ్లు చెప్పే కథ.. తెలుసుకున్న వాళ్లు చెప్పే కథ కన్నా.. తెలిసిన వారి దగ్గర నుండి తెలిసిన విషయాలన్నిటిని తీసుకుని ఓ సినిమా రూపంలో చెప్పడం గొప్పది. ఆ ప్రయత్నమే చేశాడు నందమూరి బాలకృష్ణ. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్.టి.ఆర్ సతీమణి క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్న తరుణంలో ఆయన తన మనోగతం గుర్తుచేసుకుంటాడు. బెజవాడలో రిజిస్ట్రార్ గా ఉన్న ఎన్.టి.ఆర్ ఆ ఉద్యోగం నచ్చక సినిమా రంగం వైపు అడుగులేస్తారు. మద్రాస్ వెళ్లిన ఆయనకు మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. ఫైనల్ గా విశ్వవిఖ్యాత నట సార్వ భౌమగా అశేష ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. తనకోసం ఇంత చేస్తున్న ప్రజలకు ఇంకా ఏదో చేయాలని సొంత పార్టీ పెట్టి వారికి దగ్గరయ్యాడు.
ఎలా ఉందంటే :
ఇది కల్పించిన కథ కాదు జీవిత కథ అయినా ఎన్.టి.ఆర్ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కథానాయకుడు సినిమాలో ఎన్.టి.ఆర్ సిని ప్రస్థానం గురించి చాలా గొప్పగా చూపించారు. అయితే లీడ్ పాత్ర ధారి అయిన బాలకృష్ణ యుక్త వయసు ఎన్.టి.ఆర్ పాత్రలో అంతగా సూటవ్వలేదు. సెకండ్ హాఫ్ మాత్రం అదరగొట్టాడు. సినిమా అంతా ఎన్.టి.ఆర్ పాత్రదారి బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నడుస్తుంది. తండ్రి పాత్రను బాలకృష్ణ బాగా చేశాడు. ఆయన మీద ఉన్న గౌరవం ఎంత గొప్పదో తెలుస్తుంది.
సినిమా అంటే ఎంటర్టైన్ చేయాలి. ఎంత బయోపిక్ అయినా సరే అది ప్రేక్షకులు మెచ్చేలా తెర మీద చూపించాలి. ఆ విషయంలో మహానటి సినిమా బాగా సక్సెస్ అయ్యింది. అదే దారిలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు కూడా బాగానే మెప్పించాడని చెప్పొచ్చు. సినిమా మొదటి భాగం కన్నా సెకండ్ హాఫ్ బాగా ఉంటుందనిపిస్తుంది. ఇక సినిమాకు రన్ టైం కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. అన్ని యాస్పెక్ట్స్ లో సినిమా అలరించింది. అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించినా ఫైనల్ గా ఇది ఎన్.టి.ఆర్ సిని ప్రస్థానానికి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు.
ఎలా చేశారు :
నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్.టి.ఆర్ పాత్రలో అవలీలగా మెప్పించగలిగారు. ఆయన ఇన్నేళ్ల సినిమా కెరియర్ అందుకు బాగా ఉపయోగపడ్డది. సినిమా అంతా మనం చూస్తుంది ఎన్.టి.ఆర్ నేనా అనే ఆలోచన కొన్నిసార్లు వస్తుంది. సినిమా మొత్తాన్ని భుజాన వేసుకుని నడిపించాడు బాలకృష్ణ. బసవతారకమ్మ పాత్ర కూడా అలరించింది. విద్యా బాలన్ ఆ పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. ఇక సినిమాలో ఏయన్నార్, హరికృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, డైరకర్స్ ఎల్వి ప్రసాద్, సుబ్బారావు, హీరోయిన్స్ శ్రీదేవి, జయసుధ, కృష్ణ కుమారి, సావిత్రి, జయప్రద ఇలా అందరి పాత్రల్లో నటించిన నటీనటులు మెప్పించారు.
జ్ఞాణశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇక కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. క్రిష్ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. మరోసారి ఇలాంటి సినిమాలకు తాను పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు క్రిష్. ఎడిటింగ్ బాగుంది. అయితే అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బాలకృష్ణ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా సినిమా చేశారు.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ
కెమెరా మెన్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ ల్యాగ్ అవడం
స్లో నరేషన్
బాటం లైన్ :
ఎన్.టి.ఆర్ కథానాయకుడు.. పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ టూ ఎన్.టి.ఆర్..!
రేటింగ్ : 3/5