ఆ లుక్ ఇప్పటిది కాదా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ట్రిపుల్ కు సంబందించి ఓ లుక్ రివీల్ అయ్యింది. గుబురు గెడ్డంతో ఎన్.టి.ఆర్ కాస్త బొద్దుగా ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిక్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలోదని అన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్.టి.ఆర్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని. దాని కోసమే ఎన్.టి.ఆర్ బరువు పెరిగాడని అన్నారు.

కాని ఎన్.టి.ఆర్ పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ ఎల్లాయిడ్ స్టెవెన్స్ ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. వార్తల్లో వస్తున్నట్టుగా ఎన్.టి.ఆర్ పిక్స్ ఇప్పటివి కాదని అవి సంవత్సరం క్రితం ఫోటోలను చెప్పుకొచ్చాడు స్టీవెన్స్. ట్రిపుల్ ఆర్ లో ఎన్.టి.ఆర్ లుక్ ఫిట్ గా ఉంటుందని. దానికోసం తారక్ ఎంతో కష్టపడుతున్నాడని అన్నారు స్టీవెన్స్. ఈమధ్యనే అరవింద సమేత కోసం సిక్స్ ప్యాక్ చేసిన ఎన్.టి.ఆర్ ట్రిపుల్ ఆర్ లో ఎలా కనిపిస్తాడా అన్న ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుందట. ఈ మూవీలో హీరోయిన్స్ ఇంకా ఫైనల్ అవలేదు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.