రేపు సాయంత్రం వ‌ర‌కు మ‌ద్యం విక్ర‌మాలు నిషేదం


తెలంగాణ‌లో శుక్ర‌వారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌ద్యం విక్ర‌మాల‌పై ఈ రెండు రోజులు నిషేదం విధించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… 7వ తేదీ సాయంత్రం 6 గంటలవరకు మద్యం విక్రయించరాదని, అప్పటివరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. వైన్స్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలోనూ మద్యం సరఫరా చేయవద్దని హెచ్చరించారు. ప్ర‌భుత్వ నింబంధనలు ఉల్లంఘించినట్లయితే కంట్రోల్ రూమ్ టోల్‌ ఫ్రీ నంబర్ 1800-425-523కు ఫిర్యాదు చేయాలన్నారు కోరారు.

హైదరాబాద్ కంట్రోల్ రూమ్ నంబర్ 040-24746884కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఫిర్యాదులు అందిన గంటలోపు చర్యలు తీసుకుని, లైసెన్స్ ర‌ద్దుచేస్తామ‌న్నారు. ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌లోభాలకు గురికాకుండా న‌చ్చిన నాయ‌కుడిని ఎన్నుకోవాల‌ని సూచించారు.