ఆర్‌ఆర్‌ఆర్‌ కు లీకుల బెడత… ఎన్టీఆర్‌ పిక్‌ వైరల్‌ !

-

ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే సామాన్యంగా అందరిలో అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ మల్టీస్టారర్… మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా… భారీ అంచనాలే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రమే త్రిపుల్ ఆర్. చరిత్రలో ఎన్నడూ కలగని ఇద్దరు గొప్ప వీరులు కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ ఆర్ ఆర్.

ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్… గిరిజన వీరుడు కొమురం భీం తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు మరియు పోస్టులు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌ కు సంబంధించిన ఓ ఫోటో కొన్ని క్షణాల క్రితమే లీక్ అయింది. అయితే.. ఇప్పుడు ఆ లీకైన ఫోటో… కాస్త వైరల్‌ అయింది. ఈ లీకైన ఫోటో లో ఎన్టీఆర్‌.. లుక్‌ మాములుగా లేదు. ఎన్టీఆర్‌ తలకు రుమాలు చుట్టుకుని… వెనకాల తుపాకి తగిలించుకుని… ఓ రేంజ్‌ లో కనిపించాడు ఎన్టీఆర్‌. ఈ ఫోటో లీక్‌ కావడం తో… ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ లో ఉత్సాహం నెలకొంది. ఇక ఈ ఫోటో లీక్‌ కావడం తో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీ గా పెరిగాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news