కంగ్రాట్స్ చెర్రీ, ఉపాసన : తారక్ ఎమోషనల్ పోస్ట్

-

కంగ్రాట్స్ చెర్రీ, ఉపాసన అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ రామ్ చరణ్, ఉపాసన. పేరెంట్స్ క్లబ్ లోకి స్వాగతం. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం జీవితాంతం మర్చిపోలేము.

ఆ దేవుడి ఆశీస్సులతో పాప, మీరు ఆనందంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. కాగా, మెగా ఇంట సంబురాలు షురూ అయ్యాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆడపిల్ల పుట్టినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు అధికారికంగా తెలిపారు. తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మెడికల్ బులిటెన్ విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news