ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాపై రూమర్.. నైస్ జోక్ అని కొట్టిపడేసిన నిర్మాత..!

RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా కథ, టైటిల్స్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందన్న వార్త వైరల్ గా మారింది. అటు ఇటూ చేరి అది నిర్మాత దాకా వెళ్లడంతో ఆ వార్తలను కొట్టిపడేశారు. తారక్, త్రివిక్రం సినిమా క్యాన్సిల్ అయ్యిందన్న వార్తపై నిర్మాత నాగ వంశీ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు.

NTR Trivikram Movie Rumor Producer Responded Nice Joke

ఇంతకీ ఈ రూమర్స్ పై ఆయన ఏమన్నారు అంటే.. అది నైస్ జోక్ అని ట్వీట్ చేశారు. స్టార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేంతవరకు ఇలాంటి రూమర్స్ చాలా కామన్. అయితే ఈ రూమర్స్ ను కొందరు సీరియస్ గా తీసుకుంటారు కాని మిస్టర్ కూల్ నిర్మాతగా హారిక హాసిని ప్రొడ్యూసర్ నాగ వంశీ మాత్రం అది జోక్ గా తీసుకున్నాడు. మే నెలలో ఎన్.టి.ఆర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు త్రివిక్రం. అరవింద తర్వాత ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది.