బేబీ 70 ఏళ్ల ముసలిది కాదు.. 24 ఏళ్ల పడుచు పిల్ల: ‘ఓ బేబీ’ ట్రైలర్

-

వయసు మళ్లిన వాళ్లు ఏమని కోరుకుంటారు. అబ్బా.. మళ్లీ యవ్వనం వస్తే ఎంత బాగుండు అని కోరుకుంటారు కదా. అదే కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఓ బేబీ. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. నందినీ రెడ్డి డైరెక్ట్. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్ ఈ సినిమా. రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య, లక్ష్మీ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జులై 5న విడుదల కానుంది.

తెల్లవారుజామున నాలుగు గంటలకు సన్నటి వర్షం.. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ. బేబీ అంటే 70 ఏళ్ల ముసలిది కాదు.. 24 ఏళ్ల పడుచు పిల్ల.. అంటూ రాజేంద్ర ప్రసాద్ వాయిస్ తో ఓ బేబీ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news