బాక్సాఫీస్ కా బాద్ షా రాఖీ భాయ్..KGF2 ఖాతాలో మరో అరుదైన రికార్డు

శాండల్ వుడ్ హీరో యశ్- సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ KGF2. కేజీఎఫ్ చాప్టర్ 1కు కొనసాగింపుగా వచ్చిన ఈ చాప్టర్ 2 గత నెల 14న విడుదలై రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ‘ఉగ్రమ్’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత ప్రశాంత్ నీల్ – యశ్ కాంబోలో వచ్చిన చాప్టర్ 1 కేజీఎఫ్ నుంచి మించి చాప్టర్ 2 కేజీఎఫ్ ఉండటం విశేషం.

హిందీ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా అందరికీ ఈ సినిమా నచ్చుతోంది. ఇప్పటికీ ఈ సినిమాను అభిమానులు, సినీ లవర్స్ విశేషంగా ఆదరిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఖాతాలో తాజాగా మరో అరుదైన రికార్డు నమోదైంది. కొవిడ్ మహమ్మారి వలన ప్రపంచం పడ్డ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి వలన ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది.

చాలా కాలం పాటు థియేటర్లు మూసివేయబడే ఉన్నాయి. మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ, పోస్ట్ కొవిడ్ పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ క్రమంలోనే ఓ దేశంలో ప్రదర్శితమైన తొలి కన్నడ చిత్రంగా KGF2 రికార్డు క్రియేట్ చేసింది.

దక్షిణ కొరియోలోని సియోల్ లో తాజాగా కన్నడతో పాటు హిందీ వెర్షన్‌ KGF2ను ప్రదర్శించారు. అక్కడ ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. 2022లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన భారతీయ సినిమాగా KGF2 రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు దాదాపుగా రూ.1,130కోట్ల వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఈ క్రమంలోనే చాప్టర్ 3 తీయాలని అభిమానులు కోరుతున్నారు.