ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో సుమంత్ ఏయన్నార్ గా ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమాలో ఏయన్నార్ కేవలం నాలుగు సీన్స్ మాత్రమే కనిపిస్తాడని అంటున్నారు. ఇండస్ట్రీకి రెండు కళ్లైన ఎన్.టి.ఆర్, ఏయన్నార్ సిని పరిశ్రమలో సినిమాల పరంగా పోటీ పడ్డారు కాని వ్యక్తిగతంగా ఇద్దరు ఎప్పుడూ గొడవపడలేదు.
అంతేకాదు ఎన్.టి.ఆర్ రాజకీయ రంగ ప్రవేశం సమయంలో ఏయన్నార్ సలహాలను పరిగణలోకి తీసుకున్నారట. ఇద్దరి మధ్య సినిమాలో ఈ సీన్స్ అందరిని అలరిస్తాయని తెలుస్తుంది. అటు నందమూరి ఇటు అక్కినేని ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సీన్స్ రాసుకున్నారట. ఇక ఎన్.టి.ఆర్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఏయన్నార్ ఉన్నాడట.
ఏయన్నార్ కు ఉన్నది నాలుగు సీన్సే అయినా అవి బాగుంటాయని అంటున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి.