కొత్త పాట: కలర్ ఫోటోతో కాంపిటీషన్ “ఊహించలేదసలే”

-

మనం మొదలుపెట్టిన ఏ పనైనా అమాంతం జరిగిపోతే అంత కిక్కుండదు. పని పూర్తి చేసి, రిజల్ట్ కోసం ఎదురుచూసినపుడే అసలైన మజా వస్తుంది. రిజల్ట్ వచ్చినప్పటి హ్యాపీనెస్ కన్నా ఎదురుచూపుల్లో ఉండే హ్యాపీనేసే ఎక్కువ. ఎందుకంటే ఎదురుచూపుల్లో మనం ఊహల్లో విహరిస్తూ ఉంటాం. అందులో అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతుంటాయి.

ఆ ఎదురుచూపులు ప్రేమలో ఐతే ఇంకా బాగుంటుంది. నచ్చిన అమ్మాయికైనా, అబ్బాయికైనా ఐ లవ్ యూ చెప్పి, వాళ్ళేం చెప్తారో అని ఎదురుచూస్తూ ఉంటే ఆ ఫీలింగ్ మనసుకు చాలా గమ్మత్తుగా ఉంటుంది.
ఆ గమ్మత్తు మీ అనుభవంలోకి రావాలంటే ఒక్కసారైనా మీ మనసులోని మాటను మీకు నచ్చిన వారికి చెప్పాలి.

మీకు చెప్పే ధైర్యం లేకపోయినా ఆ ఫీలింగ్ మీ అనుభవంలోకి రావాలంటే “ఊహించలేదసలే” అనే పాటను చూడాల్సిందే.

రీసెంట్ గా మైక్ టీవీలో రిలీజైన ఈ పాట, ప్రేమ పాటల్లో సరికొత్త పాటగా నిలుస్తుంది.

గుట్టుగా ఉండదు మనసే
ప్రేమను చెప్పేయమందే
ధైర్యంగా ఈ పొద్దు ఎందుకో తరిమిందే.. అని మొదలయ్యే ఈ పాటలో ప్రేమికుడు తన ప్రేమను చెప్పి, బదులు మాత్రం అప్పుడే వద్దని, ఒక వారం తర్వాత చెప్పమని చెబుతాడు.

ఆ వారం రోజులు.. ఆ అమ్మాయి ఏం చెబుతుందా అని ఊహించుకుంటూనే గడిపేస్తాడు. అలా వారం తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందనేది మీరు పాట చూసి తెలుసుకోవాల్సిందే.

పాటంటే మనసులో పాతుకుపోయిన పాత జ్ఞాపకాలను బయటకు తీయాలి. లేదంటే మనసులో కొత్త జ్ఞాపకాన్ని నాటాలి.

మీరింకా ప్రేమలో పడలేనట్టయితే మీ మనసులో కొత్త జ్ఞాపకాన్ని ఈ పాట నాటుతుంది. అండ్ మీరు ఆల్రెడీ ప్రేమించిన వాళ్లయితే మీ జ్ఞాపకాలను మళ్ళీ మీ కళ్ళ ముందుంచుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version