ఆ సినిమాకు ఆస్కార్ అవార్డుల పంట…!

-

ప్రపంచ సిని పరిశ్రమకు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు ముగింపు కార్యక్రమం నేడు ముగియనుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న విజేతలు నేడు ప్రపంచ౦ దృష్టిని ఆకర్షించానున్నారు. అయితే ఇందులో మహిళల ప్రాధాన్యత మాత్రం తక్కువగా ఉంది. ఏది ఎలా ఉన్నా ఇది సినీ పరిశ్రమకు సంవత్సరంలో బిగ్గెస్ట్ నైట్ గా చెప్పుకుంటారు. దీనితో ఈ వేడుకకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

ఇక ఉత్తమ చిత్రంగా దక్షిణ కొరియా కామెడి త్రిల్లర్ పారాసైట్ నిలిచింది. ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది. నాలుగు కేటగిరీల్లో ఈ సినిమాకు అవార్డుల పంట పండింది. బెస్ట్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ గా ఈ సినిమా నిలిచింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఎన్నో చిత్రాలు కాదని ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది.

జోకర్ సినిమాలో ఉత్తమ నటనకు గానూ జోక్విన్ ఫోనిక్స్ అవార్డు అందుకున్నారు. ఈయనకు ఇదే తొలి ఆస్కార్ అవార్డు. బుల్లి తెర నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించారు. జూడి చిత్రంలో ఉత్తమ నటనకు గానూ రెనోజావేగర్ నిలిచారు. ఇక ఇదిలా ఉంటే 92 వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక పేద కుటుంబం పడే కష్టాలను కామెడితో జోడించి ఈ సినిమాను రూపొందించారు.

ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)
ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)
ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు: బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే  : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
ఉత్తమ​ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో

Read more RELATED
Recommended to you

Latest news