OTT: ఒక్కరోజు 16 తెలుగు సినిమాలు.. అనౌన్స్..!!

-

ఈ మధ్యకాలంలో పలు ఓటీటి సంస్థలు తెలుగు సినిమాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నాయి. తెలుగు సినిమాలకు ఎంతటి ఖర్చుచేసైనా సరే దక్కించుకుంటున్న ఓటీటి దిగ్గజ సంస్థలలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. తాజాగా తెలుగు వారికి సంక్రాంతి కానుకగా ఒకేరోజు 16 సినిమాలని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల అయ్యి పండుగ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూసేటటువంటి సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. ఈసారి కూడా సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వడంతోపాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇటీవల సినిమాలు విడుదలైన తర్వాత ఏదో ఒక ఓటీటిలో వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విజయాన్ని బట్టి థియేటర్లో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఓటీటి ప్లాట్ ఫామ్ లోకి వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలను రిలీజ్ కి ముందే వాటికి ఉన్న క్రేజ్ ను బట్టి ఆ హీరోలకు ఉన్న డిమాండ్ ను బట్టి ఓటీటి నిర్వాహకులు తీసుకుంటూ ఉంటారు.

అలాగే బడ్జెట్ ప్రమోషన్ కోసం కలిసొస్తుందని నిర్మాతలు కూడా ముందుగానే ఓటీటి పార్ట్నర్ ని లింక్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగు వారికి పెద్ద పండుగను నెట్ ఫ్లిక్స్ సంక్రాంతి కానుకగా ఒకేరోజు 16 సినిమాలని త్వరలో విడుదల చేయబోతున్నామంటూ ప్రకటించింది. ఇందులో చాలావరకు షూటింగ్ దశలో ఉన్న సినిమాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఇలాంటి వాటిలో మొదట చిరంజీవి భోళా శంకర్, కళ్యాణ్ రామ్ ఆమీ గోష్, రవితేజ ధమాకా, నాని దసరా, బుట్ట బొమ్మ, మీటర్ నిఖిల్ 18 పేజీస్, డీజే టిల్లు-2 తదితర సినిమాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version