ఈవారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్‌ ఇవే!

ప్రతివారంలాగే ఈ వారం కూడా కొన్ని మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. ఈ వారం తెలుగు ఆడియెన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘టక్‌ జగదీష్​’. నాని నటించిన ఈ చిత్రం ఈరోజు రాత్రి నుంచే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.

‘ఆహా’లో విడుదల కానున్న మరో వెబ్‌సిరీస్‌ ‘ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ’. ‘ఏక్‌ మినీ కథ’ మూవీతో హిట్‌ అందుకున్న సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన సిరీస్‌ ఇది. ఈ సిరీస్‌లో టీనా శిల్పారాజ్‌, విష్ణుప్రియ హీరోయిన్స్‌గా నటించారు. ఈ రోజు రాత్రి ఎనిమిది తర్వాత ఈ సిరీస్‌ ప్రీమియర్స్‌ మొదలవుతాయి. ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్‌ అవికా గోర్‌‌ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్‌‌ ‘నెట్‌’. కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ‘జీ ఫైవ్‌’ యాప్‌లో శుక్రవారం నుంచి స్ట్రీమ్‌ కానుంది. హాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌ ‘మోర్టల్‌ కోంబాట్‌’. గత ఏప్రిల్‌లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈనెల పదకొండున ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ కూడా రిలీజ్‌ అవుతోంది. హాట్‌స్టార్‌‌లో డైరెక్ట్‌ రిలీజ్‌ కానున్న హిందీ చిత్రం ‘భూత్‌ పోలీస్‌’. సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌ కపూర్‌‌ హీరోలుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం నుంచి హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్‌ రానుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో బుధవారం రిలీజైన మరో వెబ్‌సిరీస్‌ ‘ముంబై డైరీస్‌’. మోహిత్‌ రైనా, కొంకణాసేన్‌ శర్మ కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌‌గా హిందీలో రూపొందిన ఈ సిరీస్‌ తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.