టాలీవుడ్ పై మరో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు… లక్ష రూపాయలకు కోరుకుంది ఇవ్వాలట!

-

క్యాస్టింగ్ కౌచ్ అంటే తెలియని వారుండరు. సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగుతోంది. టీవీ మరియు సినిమాకు సంబంధించిన కొంత మంది తారలు వరుసగా గతంలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకునే క్రమంలో ఈ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ తారలు కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ పై మరో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు పచ్చిష్ హీరోయిన్ శ్వేతా వర్మ. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని… అంతేకాదు తాను కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని పేర్కొంది.

2015లో ఓ యాడ్ కోసం కొందరు తనకు ఆఫర్ వచ్చిందని పేర్కొంది. అయితే ఈ యాడ్ కోసం లక్ష రూపాయలు ఇస్తామని.. అలాగే దర్శకుడు కోరుకుంది కూడా ఇవ్వాలని వారు చెప్పారని శ్వేతా వర్మ తెలిపింది. అయితే ఆ ఆఫర్ తనకు అవసరం లేదని.. ఆ దర్శకున్నే బిల్డింగ్ మీద నుంచి దూకమనండి అని బదులిచ్చాను అని శ్వేత వర్మ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నట్లు పేర్కొంది. ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలను తాను నేరుగా ఎదుర్కోలేదని.. కానీ ఆన్లైన్ మరియు సోషల్ మీడియా ద్వారానే తనకు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news