సోషల్ మీడియాలో సంచలనం.. క్లబ్ హౌస్ యాప్.. దాని విశేషాలివే.

సోషల్ మీడియా సంస్థల్లో మరో కొత్త పేరు వినిపిస్తుంది. ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ కాకుండా సొషల్ మీడియా సంస్థలు చాలా ఉన్నప్పటికీ, తాజాగా ఒక పేరు బాగా ప్రచారంలో ఉంది. అదే క్లబ్ హౌస్. ఈ యాప్ యూజర్లు రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ యాప్, చాలా కొద్ది కాలంలోనే యూజర్ల దృష్టిని ఆకర్షించింది. మరి అంతగా ఆకట్టుకునేది ఇందులో ఏముంది? ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా సంస్థలకి దీనికి తేడా ఏముంది? అనే విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

క్లబ్ హౌస్ యాప్ లో మిగతా వాటిలాగా టెక్స్ట్ మెసేజీలు, ఫోటోలు, వీడియోలు పంచుకోరాదు. ఇందులో ఆడియో రూమ్స్ ఉంటాయి. మీరు దానిలోకి ప్రవేశించినపుడు మీ ఆసక్తులను తెలపాల్సి ఉంటుంది. ఆ ఆసక్తుల మీద ఏదైనా డిస్కషన్ జరిగితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు కూడా ఆ డిస్కషన్ లో పాల్గొనవచ్చు. ఇదంతా లైవ్ లోనే జరుగుతుంది. మీకిష్టమైన సబ్జెక్టుల మీద డిస్కషన్స్ వినవచ్చు. పాల్గొని మీ అభిప్రాయాలను పంచుకోవచ్చన్నమాట.

అలాగే మీకిష్టం లేకపోతే అక్కడి నుండి బయటకు రావచ్చు. ఇలా పూర్తిగా ఆడియో రూమ్స్ మాత్రమే ఉంటాయి. ఏ టాపిక్ మీదనైనా ఆడియో రూమ్ ని మీరే క్రియేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ కి యూజర్లు పెరుగుతున్నారు. ఇండియాలోనూ డౌన్లోడ్లు పెరుగుతున్నాయి. మరికొద్ది కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని ప్రైవసీ సంబంధిత సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా రికార్డ్ చేసిన సమాచారం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కాకపోవడం అనేది యూజర్లను ఇబ్బంది పెడుతుంది.