ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన గురుకుల పీఈటి అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 సంవత్సరాలుగా గురుకుల పీఈటి ఉద్యో గాల కోసం నిరీక్షణ చేస్తున్నాం అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు వేచి చూసి కడుపు మండి ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించామని వాపోతున్నారు అభ్యర్థులు. మెరిట్ ఆధారంగా 1:1 ఫలితాల జాబితాను ప్రకటించాలని .. వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా సీఎం కెసిఆర్ స్పందించి గురుకుల పీఈటి పోస్టులు భర్తీ చేయాలని కోరారు గురుకుల పీఈటి అభ్యర్థులు. తెలంగాణ సర్కార్ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని.. పీఈటి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో… 13 మంది అభ్యర్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. అందులో ముగ్గురు మహిళల అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం సిఎం కెసిఆర్ జిల్లా పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.