మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన క్రేజ్, స్టార్డం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి…పైకి వచ్చిన వారిలో చిరంజీవి ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్న చిరంజీవి పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .63 నుంచి రూ.65 కోట్ల వరకు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. భారతప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ తో గౌరవించనుందని…. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీనిపై ప్రకటన రావచ్చని టాక్ నడుస్తోంది. సినీ రంగానికి చేసిన కృషి, కోవిడ్ టైం లో చేసిన సమాజ సేవకుగాను ఈ అవార్డు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా అప్పట్లో చిరు కరోనా బాధితుల కోసం అంబులెన్స్ సేవలు, ప్రత్యేక ఫండ్ ను ఏర్పాటుచేశారు.