తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు రచయితగా, నటులుగా పేరుపొందారు పరుచూరి బ్రదర్స్. అయితే వీళ్ళల్లో గోపాలకృష్ణ మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యల పైన , సినిమాల పైన పలు విధాలుగా స్పందిస్తూనే ఉంటారు ఈయన. గతంలో ఆచార్య సినిమా ఫ్లాప్ కావడం వెనుక ఉన్న కొన్ని కారణాలను కూడా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంపై ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
మహేష్ బాబు, కీర్తి సురేష్, డైరెక్టర్ పరశురాం కాంబినేషన్లో వచ్చిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడమే కాకుండా రూ.200 కోట్ల రూపాయల క్లబ్బులో చేరింది ఈ చిత్రం. ఈ సినిమా మొత్తం కథ బ్యాంకింగ్ రంగంలో కోట్ల రూపాయలు రుణాలను ఎగ్గొట్టిన కొంతమంది బాడా బాబుల యొక్క కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది . ఈ సినిమా మహేష్ బాబు అభిమానులను బాగానే ఆకట్టుకున్నదని చెప్పవచ్చు.
ఇక ఈ చిత్రం చూసిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే ఈ చిత్రం మరింత విజయాన్ని అందుకునేది. ఇక ఈ చిత్రం టైటిల్ చూడగానే సర్కార్ వారి పాట వలన ఏదో ఒక ఘోరం జరుగుతుందని ఈ సినిమా టైటిల్ లోని తెలుస్తోంది. అందుచేతనే కాస్త టైటిల్ కూడా మార్చి ఉంటే బాగుండు అన్నట్లుగా తెలియజేశారు. ఇక ఈ సినిమా మొదటి భాగం అంతా బాగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ హీరో హీరోయిన్ల మధ్య కామెడీ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. కానీ సినిమా మధ్యలో వచ్చేసరికి సడన్గా చేంజ్ చేయడం వల్ల ఈ సినిమా ఓవర్ అఫ్ ది ఫిలిమ్ అయిపోయిందని తెలియజేశారు గోపాలకృష్ణ. ఈ చిత్రం ఇప్పుడు 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది
అనుకుంటే కాస్త మార్పులు చేసి ఉంటే మరొక 100 కోట్లు అయినా ఎక్కువ వచ్చేవని గోపాలకృష్ణ ఇది తన మనసులో మాటగా తెలియజేశారు.