వారి చేతిలో దారుణంగా మోసపోయిన పార్వతి మెల్టన్.. ఇప్పుడేం చేస్తోందంటే..?

ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఎంతోమంది వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంత స్టార్ ఇమేజ్ దక్కించుకుంటారో అంతే తక్కువ సమయంలో ఇండస్ట్రీ ని వదిలి దూరం అవుతున్న వారు కూడా ఉన్నారు. అలా తక్కువ సమయంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో పార్వతి మెల్టన్ కూడా ఒకరు. ఇక ఈమె ప్రముఖ దర్శకుడు దేవా కట్ట దర్శకత్వం వహించిన వెన్నెల అనే చిత్రం ద్వారా 2005లో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమాలో ఆమెకు జోడిగా రాజా హీరోగా నటించారు. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పార్వతి మెల్టన్ ఆ తర్వాత అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత జల్సా సినిమాలో స్పెషల్ పాటతో ప్రేక్షకులకు దగ్గర అయి.. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మరింత ఆకట్టుకుంది.

అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె వెన్నెల సినిమా తర్వాత అల్లరే అల్లరి, గేమ్ వంటి సినిమాలలో నటించినా కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వలేకపోయింది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు.ఇకపోతే 2012లో చివరిగా తెలుగులో రిలీజ్ అయిన యమహో యమ అనే చిత్రంలో కనిపించి ఇంక పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. 2013లో సంశులాలని వివాహం చేసుకున్న ఈమె వైవాహిక జీవితంలో బిజీగా ఉందని చెప్పాలి.

ఇకపోతే సినీ ఇండస్ట్రీకి ఆమె దూరం కావడానికి మరొక కారణం కూడా ఉంది.. పార్వతీ మెల్టన్ అందాలకు ఫిదా అయినా ఆ డైరెక్టర్ తన సినిమాలలో కూడా ఈమెకు అవకాశం కల్పించారు. హీరోయిన్ ని చేస్తానని కూడా తెలిపాడు కానీ ఎట్టకేలకు ఆమెను వంచించి మోసం చేశాడు..ఇక ఆ మోసాన్ని తట్టుకోలేక ఆమె ఇండస్ట్రీకి దూరమైందని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికైతే ఆదర్శకుడి చేతిలో మోసపోయిన పార్వతి మెల్టన్ ఇండస్ట్రీకి దూరమై వివాహం చేసుకొని ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తోంది.